తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పదనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతె వాళ్ళని నువు మరచినట్టురా ఇది మరువబోకురా

Friday, September 28, 2012

ప్రపంచ తెలుగు మహసభలు -సి.ఎం

ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.
డిసెంబర్‌ 27, 28, 29 తేదీల్లో తిరుపతిలో జరిగే నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముఖ్యమంత్రి కోరారు.
గురువారం జూబ్లీహాల్‌లో జరిగిన రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి వట్టి వసంతకుమార్‌ అధ్యక్షతన వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులతో పాటు అసెంబ్లీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాష, సంస్కృతి,
సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఈ ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కోరారు.
27 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
మొదటిసారి 1975లో రాష్ట్రంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయని అన్నారు. ఈ సభలు విజయవంతమయ్యేందుకు పార్టీలకు అతీతంగా నేతలంతా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు.
తెలుగు భాష, సంస్కృతి ప్రతిబింబించే విధంగా గ్రామాలలో, మండలాల్లో, జిల్లాల్లో జరిగిన ఆసక్తిగల అంశాలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని ఆయన కోరారు.
1975లో జరిగిన తొలి ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న వారి కుటుంబ సభ్యులు కూడా ఈ సమావేశంలో ఉన్నారని, వారి సలహాలు, సూచనలు ఎంతో అవసరమని ముఖ్యమంత్రి అన్నారు.
ప్రపంచంలో వివిధ రంగాల్లో పేరు, ప్రఖ్యాతులు గడించిన తెలుగువారందరినీ ఈ సభల్లో గౌరవించడం గొప్ప విషయమని కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

సేకరణ...erramirchi.com 

No comments:

Post a Comment