తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పదనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతె వాళ్ళని నువు మరచినట్టురా ఇది మరువబోకురా

Saturday, September 22, 2012

నా మాట


తెలుగు బ్లాగులు చదవడం అలవాటై నాకు కూడ ఒక బ్లాగు వ్రాయలన్న అలోచన వచ్చింది. కానీ ఏమి వ్రాయాలో తెలియదు ఏ విషయం మీద వ్రాయాలో కూడా తెలియలేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా అలోచిస్తే అప్పుడు వచ్చిన అలోచనే ఈ బ్లాగు. బ్లాగు క్రియెట్ చేయాలి అని సిస్టం ముందు కూర్చోని ముందుగా బ్లాగ్ స్పాట్ లో రిజస్టర్ చేస్తున్నప్పుడు నానా రకాలుగా ఇబ్బంది పడ్డాను అవేమిటంటే ముఖ్యంగా బ్లాగ్ పేరు, ముందుగా ఒకటి అనుకొని స్టార్ట్ అయితే చేశాను కాని ఎందుకో అది నచ్చలేదు చివరకు ఏపి వెబ్ పేజెస్ అనే పేరు బాగుంది అని రిజస్టర్ చేశా..ఆ తరువాత స్టెప్ బ్లాగ్ టెంప్లెట్ అక్కడ కూడా చాలా వెదికి చివరకు బ్లాగ్ స్పాట్ వారు అందించే టెంప్లెట్ కు కొంచెం చెంజెస్ చేస్తె చివరకు ఇలా ఉంది. ఇలా ఇప్పటికే తెలుగులో చాలా వెబ్ సైట్స్ మరియు బ్లాగులు ఉన్నా కాని ఎవరికి తెలిసింది వాళ్లు వ్రాస్తుంటారు.
                               నాకు తెలిసిన సాంకేతిక పరమైన విషయాలు, పది మందికి ఉపయేగపడే వెబ్ సైట్లు, మన తెలుగు బ్లాగుల గురించి సాధ్యమైనన్ని విషయాలు మీతో పంచుకుంటాను........నాకు తెలుగు టైప్ చెయ్యటం కూడా సరిగా రావటం లేదు..బ్లాగోకంలో ఉన్న మిత్రులందరూ నా ప్రయత్నాన్ని మన్నిస్తారని  కోరుకుంటున్నాను...

No comments:

Post a Comment