తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పదనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతె వాళ్ళని నువు మరచినట్టురా ఇది మరువబోకురా

Tuesday, October 2, 2012

తెలుగులో కంప్యూటర్స్

......తెలుగులో కంప్యూటర్స్ గురించిన హర్డ్ వెర్ మరియు సాప్ట్ వెర్ ల సాంకేతికపరమైన విషయాలు,అన్లైన్ బోదనలు ఇంకా అనేకరకమైన సందేహాలను తీర్చటానికి కొంతమంది సాంకేతిక నిపుణులు వారికి తెలిసిన సమాచారన్ని మనతో పంచుకోవడానికి బ్లాగులలో కాని వెబ్ సైట్లలో కాని పొందుపరిచారు....ఆ విలువైన బ్లాగులు మీ కోసం

Friday, September 28, 2012

ప్రపంచ తెలుగు మహసభలు -సి.ఎం

ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.
డిసెంబర్‌ 27, 28, 29 తేదీల్లో తిరుపతిలో జరిగే నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముఖ్యమంత్రి కోరారు.
గురువారం జూబ్లీహాల్‌లో జరిగిన రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి వట్టి వసంతకుమార్‌ అధ్యక్షతన వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులతో పాటు అసెంబ్లీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాష, సంస్కృతి,
సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఈ ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కోరారు.
27 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
మొదటిసారి 1975లో రాష్ట్రంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయని అన్నారు. ఈ సభలు విజయవంతమయ్యేందుకు పార్టీలకు అతీతంగా నేతలంతా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు.
తెలుగు భాష, సంస్కృతి ప్రతిబింబించే విధంగా గ్రామాలలో, మండలాల్లో, జిల్లాల్లో జరిగిన ఆసక్తిగల అంశాలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని ఆయన కోరారు.
1975లో జరిగిన తొలి ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న వారి కుటుంబ సభ్యులు కూడా ఈ సమావేశంలో ఉన్నారని, వారి సలహాలు, సూచనలు ఎంతో అవసరమని ముఖ్యమంత్రి అన్నారు.
ప్రపంచంలో వివిధ రంగాల్లో పేరు, ప్రఖ్యాతులు గడించిన తెలుగువారందరినీ ఈ సభల్లో గౌరవించడం గొప్ప విషయమని కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

సేకరణ...erramirchi.com 

Thursday, September 27, 2012

తెలుగు లో టైపింగ్ ఎలా ? - 2

ఇక్కడ మీ కోసం మరికోన్ని తెలుగు టైపింగ్ ఉపరకరణలుః
     
ముందు టపా

1.లెక్సీలోగోస్

*************************************************************************************************************
2.తెలుగు లిపి

*************************************************************************************************************
3.ఇంగ్లీష్ టూ తెలుగు

*************************************************************************************************************
4. సరళ

Sunday, September 23, 2012

తెలుగు లో టైపింగ్ ఎలా ?

మీరు  ఇంటర్నెట్లో తెలుగు లో టైప్ చేయగలరు ఎలా అని ఆలోచిస్తున్నారా ? ఇది మీరు అనుకున్నంత కష్టం కాదు.
ఇక్కడ రెండు వేర్వేరు తెలుగు టైపింగ్ పద్ధతులు ఉన్నాయి. మొదటి పద్ధతి ఒక ప్రత్యేకమైన తెలుగు కీబోర్డు మరియు మీ కంప్యూటర్లో తెలుగు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. ఈ పద్ధతిలో మంచి సాంకేతికతను మరియు ప్రధానంగా ఇంగ్లీష్ లో మరియు అప్పుడప్పుడు తెలుగు లో ఇంటర్నెట్ ఉపయోగించి టైప్ చేయటానికి అనుకూలంగా ఉంటుంది.

రెండవ పద్ధతి సులభమైన పద్ధతి. ఈ పద్ధతిలో శబ్ద ఇంగ్లీష్ లో తెలుగు టైప్ చేయటం. ఉదాహరణకు టైపింగ్ Amma  (అమ్మ) ఈ పద్ధతిలో కొత్తవారు కూడా సులువుగా తెలుగులో టైప్ చేయగలరు.

ఇక్కడ మీ కోసం కొన్ని అన్ లైన్ టైపింగ్ పరికరాలు :

1.లేఖిని

*************************************************************************************************************

2.క్విల్ ప్యాడ్

*************************************************************************************************************

3. గూగుల్ ఇండిక్ లిప్యంతరీకరణ

*************************************************************************************************************

4.స్వేచ్ఛ
*************************************************************************************************************

4.ప్రముఖ్ టైప్ పాడ్

************************************************************************************************************* 
5.విండిక్ పాడ్ (ఎడిటర్)

 *************************************************************************************************************
6. తెలుగు టైపింగ్ 

************************************************************************************************************* 
7. లిపికార్

Saturday, September 22, 2012

నా మాట

తెలుగు బ్లాగులు చదవడం అలవాటై నాకు కూడ ఒక బ్లాగు వ్రాయలన్న అలోచన వచ్చింది. కానీ ఏమి వ్రాయాలో తెలియదు ఏ విషయం మీద వ్రాయాలో కూడా తెలియలేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా అలోచిస్తే అప్పుడు వచ్చిన అలోచనే ఈ బ్లాగు. బ్లాగు క్రియెట్ చేయాలి అని సిస్టం ముందు కూర్చోని ముందుగా బ్లాగ్ స్పాట్ లో రిజస్టర్ చేస్తున్నప్పుడు నానా రకాలుగా ఇబ్బంది పడ్డాను అవేమిటంటే ముఖ్యంగా బ్లాగ్ పేరు, ముందుగా ఒకటి అనుకొని స్టార్ట్ అయితే చేశాను కాని ఎందుకో అది నచ్చలేదు చివరకు ఏపి వెబ్ పేజెస్ అనే పేరు బాగుంది అని రిజస్టర్ చేశా..ఆ తరువాత స్టెప్ బ్లాగ్ టెంప్లెట్ అక్కడ కూడా చాలా వెదికి చివరకు బ్లాగ్ స్పాట్ వారు అందించే టెంప్లెట్ కు కొంచెం చెంజెస్ చేస్తె చివరకు ఇలా ఉంది. ఇలా ఇప్పటికే తెలుగులో చాలా వెబ్ సైట్స్ మరియు బ్లాగులు ఉన్నా కాని ఎవరికి తెలిసింది వాళ్లు వ్రాస్తుంటారు.
                               నాకు తెలిసిన సాంకేతిక పరమైన విషయాలు, పది మందికి ఉపయేగపడే వెబ్ సైట్లు, మన తెలుగు బ్లాగుల గురించి సాధ్యమైనన్ని విషయాలు మీతో పంచుకుంటాను........నాకు తెలుగు టైప్ చెయ్యటం కూడా సరిగా రావటం లేదు..బ్లాగోకంలో ఉన్న మిత్రులందరూ నా ప్రయత్నాన్ని మన్నిస్తారని  కోరుకుంటున్నాను...